తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా కూలీ సెకండ్ లిరికల్ ‘ మోనికా’ సాంగ్ ను రిలీజ్ చేసారు.
జైలర్ లోని కావాలయ్యా అంత కాకున్నా పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. ఈ సాంగ్ లో పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే అందాలు ఆరబోసింది. రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ గా అందాలు ఎరవేస్తూ డాన్స్ దుమ్ములేపింది. కానీ పూజా కంటే ఆమె పక్కన డాన్స్ చేసిన మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ కు ఎక్కువ పేరు వచ్చింది. మలయాళ సినిమాల్లో కమెడియన్ గా కనిపించే సౌబిన్ నివిన్ పౌలి ‘ప్రేమమ్’ తో మంచి గుర్తింపు తెచుకున్నాడు. అలాగే మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో నటుడిగాను ప్రశంసలు అందుకున్నాడు సౌబిన్. ఇప్పుడు కూలీలోని మోనికా సాంగ్ లో మనోడు డాన్స్ తో అదరగొట్టాడు. పూజ కంటే స్పీడ్ గా స్టెప్పులేస్తు చెలరేగాడు. అందాలు ఆరబోసిన పూజ కంటే డాన్స్ తో అదరగొట్టిన సౌబిన్ కు ఏక్కువ గుర్తింపు వస్తుండడంతో పూజ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అసలే రెట్రో తో వచ్చిన నెగిటివ్ ఇమేజ్ ను మోనికా సాంగ్ తో పోగొట్టుకుందాం అనుకుంటే తేడా వచ్చింది వ్యవహారం.