Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం విదితమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారింది. ఇక తాజాగా ఆర్జే, కమెడియన్ హేమంత్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూ చైతూ తన లవ్ గురించి ఓపెన్ అయ్యాడు. ఎప్పుడూ రిజర్వ్డ్ గా ఉండే చైతన్య.. ఈ ఇంటర్వ్యూలో కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.
మీ ఫస్ట్ లవ్ గుర్తుందా.. అన్న ప్రశ్నకు సమాధానంగా చైతూ మాట్లాడుతూ ” మొదటి ప్రేమను ఎవరు మర్చిపోతారు. నేను 8 లేదా 9 వ తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. నాలాగా మరో ఇద్దరు కూడా అదే అమ్మాయిని ఇష్టపడ్డారు. అయితే చివరికి ఆమె నా హృదయనే కాకుండా ఆ ఇద్దరి హృదయాలను కూడా ముక్కలు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము ముగ్గురం మంచి స్నేహితులం అయ్యాం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. రాశీ సైతం తన చిన్ననాటి లవ్ స్టోరీని తన మొదటి సంపాదన గురించి చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలంటే ఇంకో రెండు రోజులు ఎదురుచూడక తప్పదు.