రెజీనా ఆవిష్కరించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ ఫస్ట్‌లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను జీ 5 ఓటీటీ రిలీజ్ చేసింది. తాజాగా ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీని వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. దీనికి ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథను అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దీనికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రెజీనా విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు.
‘హెడ్స్ అండ్ టేల్స్’లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. ‘గర్ల్ ఫార్ములా’ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య – దివ్య ద్వయం మరోసారి ఈ సినిమాతో ప్రజల ముందుకొస్తున్నారు.
Also Read
- Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! 'రామాయణ'ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
‘హెడ్స్ అండ్ టేల్స్’ గురించి మేకర్స్ మాట్లాడుతూ “ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ” అని చెప్పారు. దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ “ఒక్క రాత్రిలో జరిగే కథతో ‘హెడ్స్ అండ్ టేల్స్’ తెరకెక్కించాం. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళలు సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమా ఇది” అని అన్నారు. ఈ నెల 22 నుండి జీ 5 ఓటీటీ లో ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!