Crucial change in Eagle’s OTT version: రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్ ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మణి బాబు డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈ టీవీకి సంబంధించిన విన్ యాప్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాని థియేటర్ లో చూసి మరలా ఓటీటీలో చూసినవారు ఒక తేడా గమనించారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది, అసలు విషయం ఏమిటంటే థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు సినిమా ముగిస్తున్న సమయంలో ఈగల్ -2 యుద్ధకాండ అనే టైటిల్ తో ముగించారు.
Delhi Budget 2024: మహిళలకు ఢిల్లీ ప్రభుత్వ కానుక.. ప్రతి నెల అకౌంట్లో రూ.1000
కానీ ఓటిటిలో మాత్రం పార్ట్ 2 వస్తున్నట్లు హింట్ ఇచ్చారు కానీ యుద్ధకాండ అనే పదాన్ని తప్పించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తాము సేఫ్ అయ్యామని సినిమా యూనిట్ ప్రకటించింది. కాబట్టి రెండో భాగం కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కానీ మొదటి భాగం చివరలో ప్రకటించినట్లు యుద్ధకాండ పేరుతో మాత్రం ఉండే అవకాశం లేదని తాజా చర్యతో క్లారిటీ వచ్చినట్లు అయింది. ఇక ప్రస్తుతానికి రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమా తర్వాత ఈగల్ టు పట్టాలెక్కే అవకాశం ఉంది ఈ లోపు కార్తీక్ ఘట్టమనేని తేజతో ఒక సినిమా ప్లాన్ చేశాడు. అది కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లోనే తెరకెక్కుతూ ఉండటం గమనార్హం.