సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్లు, బ్రేకప్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా మరో బ్రేకప్ జరిగిందంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెట్టబోతోంది. RC15 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతోంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ స్టార్ తో ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ జంటకు సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే… బ్రేకప్.
Read Also : Acharya Event : కాజల్ ఊసే లేదు… విలన్ని కూడా పక్కన పెట్టేశారే !?
అవును కియారా, సిద్ధార్థ్ జంట విడిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఇంతకుముందులా తరచుగా కలవడం లేదని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు వీరిద్దరి ప్రేమ వ్యవహారమే ఇంకా తేలలేదు. ఎప్పటికప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఈ జంట విడిపోయింది అంటూ ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తుండడం గమనార్హం. వీరిద్దరూ కలిసి నటించిన “షేర్షా” ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో చూడాలి.