Harry Josh: రామ్ చరణ్ కు, మంచు లక్ష్మీకి అతనే విలన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer: బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు తెచ్చుకున్న హ్యారి జోష్ ఇక టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాడు. హిందీలో “వాంటెడ్, వెల్కమ్, ధూమ్ -2, గోల్ మాల్ -3, టార్జాన్ ది వండర్ కార్, కిస్నా, ముసాఫిర్, రామయ్యా వస్తావయ్యా, సింగ్ ఈజ్ బ్లింగ్” వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు హ్యారి. అదే సమయంలో తెలుగులోనూ అల్లు అర్జున్ ‘బద్రినాథ్’లో మెయిన్ విలన్ గా నటించి టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు కాస్తంత గ్యాప్ తర్వాత మరోసారి హ్యారీ టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’లో విలన్ గా నటిస్తున్న హ్యారి… మంచు లక్ష్మి మెయిన్ లీడ్ గా సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ‘ఆది పర్వం’లో ఫుల్ లెంగ్త్ ఖతర్నాక్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా… పంజాబీ, కన్నడ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈ బహు భాషా నటుడు హాలీవుడ్ లోనూ తన సత్తా చాటడం విశేషం. సుమారు 100 యాడ్ ఫిల్మ్స్ లోనూ నటించిన హ్యారి, తాను తెలుగులో నటిస్తున్న “గేమ్ చేంజర్, ఆది పర్వం” మంచి గుర్తింపు తెస్తాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. విశేషం ఏమంటే.. హ్యారీ సినీరంగ ప్రవేశం కూడా చాలా చిత్రంగా జరిగింది. ఉద్యోగ రీత్యా కెనడాలో ఉండగా… అక్కడికి షూటింగ్ కోసం వెళ్ళిన హృతిక్ రోషన్ కు లొకేషన్స్ విషయంలో హ్యారీ సాయం చేయడం జీవితాన్ని మలుపు తిప్పింది. కెనడా నుండి అతన్ని తిరిగి ఇండియా వచ్చేలా చేసింది. హృతిక్, రాకేష్ రోషన్ ప్రోత్సాహంతో… అమితాబ్ బచ్చన్ తో కలిసి యాడ్ ఫిల్మ్ చేసే అవకాశం దక్కించుకున్న హ్యారీ.. అమ్రిష్ పురి తన రోల్ మోడల్ అని చెబుతుంటాడు. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే తలంపుతో భాషను నేర్చుకోవడానికి హ్యారీ విశేష కృషి చేస్తున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
-
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!