హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” లింగుసామికి నేను పెద్ద ఫ్యాన్ ను.. ఆయన సినిమాలను థియేటర్లో ఎన్ని సార్లు చూశానో తెలియదు. రన్, పందెం కోడి, ఆవారా సినిమాల గురించి అందరికి తెల్సిందే. లింగుసామి అంటే యాక్షన్ తో కూడిన ఫాసోనెటిక్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్లు చాలా అరుదు. అందులో లింగు సామి ఒకరు. ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ వెల్ కమ్ చెప్తోంది.
ఇక కృతి శెట్టి గురించి చెప్పాలంటే.. ఈ మధ్య ఎక్కడ చూసిన ఆమె కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కృతి డాన్స్ చాలా బాగా చేసింది. ముందు ముందు ఆమె ఇంకా మంచి సినిమాలు చేస్తోంది. ఇక మా హీరో రాపో.. మా హీరోలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే.. డైరెక్టర్లతో బెస్ట్ ర్యాపో మెయింటైన్ చేస్తాడు. ఎన్నోసార్లు రామ్ ను కలిసి సినిమా చేయాలని చూసాం .. కానీ కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక హీరోలా కాకుండా ఒక ఆడియెన్ లా అలోచించి కథ వింటాడు. ఒకసారి నేనొక కథ చెప్పాను. లవ్ స్టోరీ చాలా సెన్సిటివ్ కథ .. అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు.. డెఫినెట్ గా అది రామ్ కైండ్ అఫ్ సినిమా అయితే కాదు. అది విన్నాకా నచ్చలేదు అని చెప్పకుండా రామ్ ఒక డైలాగ్ చెప్పాడు. బ్రో.. ఈ కథ విన్నాకా ఫ్యాన్ మూడో లో ఉంది.. మనం కథ చేస్తే ఐదులో తిరగాలి అన్నాడు.. అది బాగా నచ్చింది నాకు.. ఎప్పటికైనా రామ్ తో సినిమా చేస్తాను. అది ఎప్పుడు అని చెప్పలేను.. కానీ రామ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.