Harish Shankar : దేవి శ్రీ ప్రసాద్ మీద డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన పోస్టు చేశారు. ఇదే నీ సంస్కారం అంటూ ఆయన చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ “గద్దల కొండ గణేశ్ సినిమాకు ముందు నన్నే అడిగారు. అందులో ఒక రీమేక్ సాంగ్ ఉంది. నేను రీమేక్ చేయనని చెప్పేశాను. నా కెరీర్ లో ఎన్నడూ రీమేక్ సాంగ్ చేయొద్దని కండీషన్ పెట్టుకున్నాను. హరీశ్ శంకర్ ఆ సాంగ్ తీసేద్దాం అంటే నేను వద్దని చెప్పాను. నా కోసం సాంగ్ తీసేయొద్దని నేనే తప్పుకున్నాను. ఇదే విషయాన్ని హరీశ్ శంకర్ ఆ మూవీ ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఆయనకు నా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు చెడ్డ పేరు రావొద్దని ఆయన చెప్పారు’ అంటూ దేవి గుర్తు చేశారు.
Read Also : Prabhas: ప్రభాస్ కోసం ‘రాజాసాబ్’ వెయిటింగ్ మోడ్!
ఇదే వీడియోను హరీష్ శంకర్ ఎక్స్ లో పోస్టు చేస్తూ ఇలా రాసుకొచ్చారు. “గుర్తింపు కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో.. ఇలా గుర్తు పెట్టుకుని మాట్లాడటం నీకే చెల్లింది దేవి. ఇదే నీ సంస్కారం” అంటూ ప్రశంసలు కురిపించారు. “మీ సంగీతం గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేశారు’ అంటూ రాసుకొచ్చారు హరీశ్. దాంతో ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. హరీశ్ శంకర్ ప్రస్తుతం పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. దేవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.