Harish Shankar: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన.. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో దాదాపు పదేళ్ల తరువాత మరోసారి ఈ కాంబో రీపీట్ కావడంతో అభిమానులు అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పటీకే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పవన్.. వారాహి యాత్రలో బిజీగా ఉండడంతో షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన మిగతా వర్క్ ను పూర్తిచేస్తున్నాడు.
Rudrangi Trailer: జగ్గు భాయ్.. విలనిజంతోనే భయపెట్టి చంపేసేలా ఉన్నాడు
ఇక తాజాగా హరీష్.. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యాడు. నితిన్ గడ్కరీ నివాసానికి వెళ్లి మరీ హరీష్.. ఆయనను పలకరించారు. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. “నితిన్ గడ్కరీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. విజనరీ లీడర్.. ఎంతో లోతుగా ఆలోచించే నాయకుడు.. నితిన్ గడ్కరీ సర్.. మీతో గడిపిన సమయం ఎంతో అద్భుతం.. థాంక్యూ ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అయితే ఈ సడెన్ భేటీ ఎందుకు అనేది మాత్రం మిస్టరీగా ఉంది. ఉస్తాద్ కోసం అయితే కాదుగా హరీష్ బ్రో.. ఏమైనా గట్టిగా ప్లాన్ చేశావా..? అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకో పక్క సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో కొంత మంది ప్రముఖుల్నికలిసి బీజేపీకి మద్దతివ్వాలని నాయకులు కోరుతున్నారు. అన్ని రంగాల వారిని పిలిచి, మాట్లాడి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఏమైనా హరీష్ ను పిలిచారా..? అనేది తెలియాల్సి ఉంది.
https://twitter.com/harish2you/status/1673284459167383554?s=20