పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, ఇంకా కార్యరూపం దాల్చుకోలేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ, ఇదెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు, రాజకీయ వ్యవహారాల నుంచి పవన్ కాస్త ఫ్రీ అయ్యాక.. ఈ సినిమా మొదలుపెట్టాలని హరీశ్ శంకర్ ప్రణాళికలు రచిస్తున్నాడు.
ఇదిలావుండగా.. ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో పవన్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడన్నదే ఆ రూమర్ సారాంశం!అది నిజమేనని లేటెస్ట్‌గా హరీశ్ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారని, ఈ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని తెలిపాడు. అంతేకాదు, ఈ చిత్రంలో ఫ్యాన్స్‌కి కావాల్సిన హై-మూమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయన్నాడు. అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు హరీశ్ పేర్కొన్నాడు. దీంతో, ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.