పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగ రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
Also Read : Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్
అటు బిజినెస్ సర్కిల్స్ లోను హరిహర రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఏరియాల వారీగా అమ్మకాలు మొదలుపెట్టారు మేకర్స్. ఆంధ్ర ఏరియాకు గాను రూ. 80 కోట్ల రేషియో చెబుతున్నారు. ఇక తెలంగాణ నైజాం ఏరియాకు గాను రూ. 65 కోట్లకు అటు ఇటుగా డిమాండ్ చేస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతానికి గాను రూ. 25 కోట్లుగా డిస్ట్రిబ్యూటర్లతో బేరాలు చేస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ బేరాలు ఇంకా సాగుతున్నాయి. ట్రైలర్ కు ముందు కూడా నిర్మాత ఇవే రేట్లు చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు వెనుకాముందు ఆడారు. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై బజ్ వచ్చింది. దాంతో నిర్మాత ఏ ఎం రత్నం థియేట్రికల్ రైట్స్ ను గట్టిగానే చెప్తున్నారు. సినిమా హిట్ టాక్ వస్తే ఈ మొత్తం రాబట్టడం అంట కష్టమేమీ కాదు. కానీ తేడా వస్తే ఏంటి అనే దానిపై డిస్ట్రిబ్యూటర్లు వెనక ముందు అలోచిస్తున్నారు.