HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ జ్యోతికృష్ణ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘హరిహర వీరమల్లు కథను క్రిష్ రాసుకున్నప్పుడు కోహినూర్ డైమండ్ దొంగిలించే ఓ కామెడీ మూవీగా తీయాలనుకున్నారు. మేం కూడా ముందు అదే అనుకుని స్టార్ట్ చేశాం. ఈ విషయం ఇన్ని రోజులు కావాలనే దాచిపెట్టాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చెప్పొచ్చు. ఈ సినిమాను క్రిష్ స్టార్ట్ చేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ చేశాక ఫస్ట్ వేవ్ కరోనా వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత మరో యాక్షన్ ఎపిసోడ్ తీశాం.
Read Also : Tamannah Bhatia : మిల్కీ బ్యూటీ ఘాటు ఫోజులు..
దాని తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో మళ్లీ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల బిజీలో పవన్ కల్యాణ్ పడిపోయారు. క్రిష్ మా కోసం చాలా వెయిట్ చేసి చివరకు తప్పుకున్నారు. అప్పుడు కథ నా దగ్గరకు వచ్చింది. ఇంత బడ్జెట్ పెట్టి మూవీని కామెడీ రోల్ లో తీయడం కంటే సనాతన ధర్మం వైపు తీయాలని ఆలోచన వచ్చింది. ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తానని పవన్ కల్యాణ్ కు చెప్పా. ఆయన ఓకే అని నువ్వు డైరెక్ట్ చెయ్ అన్నారు. మొదటి పార్టులో కథ చాలా వరకు నేను రాసుకున్నదే. రెండో పార్టులో క్రిష్ రాసుకున్న కోహినూర్ వజ్రం దొంగిలించే కథ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు జ్యోతికృష్ణ. ఇంత పీరియాడికల్ భారీ బడ్జెట్ మూవీని కామెడీ సినిమాగా తీయాలనుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Read Also : Naga Chaithanya : ఇద్దరు పిల్లలు కావాలి.. ఇష్టాలను బయటపెట్టిన నాగచైతన్య