హనుమాన్ మూవీ చిన్న సినిమాగా రిలీజై ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో బజ్ జనరేట్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్ హనుమాన్ సినిమాకి హైప్ తెచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ… హనుమాన్ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెడుతున్నాడు. సంక్రాంతి ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రేస్ లో ఉన్నా కూడా తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కంటెంట్ బాగుంది, ఆడియన్స్ లో సినిమాపై నమ్మకం ఉంది, ప్రమోషన్స్ బాగున్నాయి ఇప్పుడు మిస్ అయితే హనుమాన్ సినిమాకి మళ్లీ ఇంత పాజిటివ్ టైమ్ దొరికే అవకాశం కనిపించట్లేదు. అందుకే హనుమాన్ మేకర్స్ వెనక్కి తగ్గకుండా జనవరి 12నే రిలీజ్ చేస్తున్నారు. బుక్ మై షో ఇంట్రెస్ట్ లు కూడా హనుమాన్ సినిమా టాప్ లో ఉంది.
జనవరి 12న రిలీజైనా కూడా పండగ సీజన్ తర్వాత నుంచే హనుమాన్ అసలైన సత్తా ఏంటో అందరికీ తెలియనుంది. అన్ని సినిమాలు సైలెంట్ అయిపోయిన దగ్గర నుంచి హనుమాన్ మూవీ సందడి స్టార్ట్ అవుతుందని మేకర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే మేకర్స్ అసలు వెనక్కి తగ్గకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హనుమంతుడి ఎఫెక్ట్ తో ఒక ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ ని రిలీజ్ చేసారు. రీల్స్ చేసే వాళ్లకి ఈ ఫిల్టర్ భలే నచ్చే అవకాశం ఉంది. హనుమంతుడే ఫోన్ లోకి వచ్చినట్లు ఉన్న ఈ ఇన్స్టా ఫిల్టర్ తో ఆడియన్స్ రీల్స్ చేస్తున్నారు. మేకర్స్ ప్రమోషన్స్ లో ఇదే జోష్ ని జనవరి 12 వరకూ మైంటైన్ చేస్తే హనుమాన్ సినిమా మహేష్ బాబు లాంటి మైటీ స్టార్ హీరోతో క్లాష్ లో కూడా మంచి బిజినెస్ ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ.
Unleash the Most Powerful & the Biggest Superhero with the #HANUMAN Exclusive Instagram AR Filter 📲
Turn On Your Main Camera & Point it towards the sky. Hold it for a few seconds & Unfold the Magic 😎#HanuManEverywhere 🙏
A @PrasanthVarma Film… pic.twitter.com/tV0x1wOSEf
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2024