Guardian : ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .తన అందం నటనతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.2022 డిసెంబర్‌లో తన ప్రియుడు మరియు బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను హన్సిక పెళ్లాడింది. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే హన్సిక వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ భామ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్. ఈ మూవీకి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు.
మార్చి 8న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈమూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.థియేటర్స్ లో విడుదల అయినా మొదటి వారమే ఈ మూవీ కనుమరుగైపోయింది.ఈ సినిమాలో హన్సిక యాక్టింగ్ మినహా హారర్ ఎలిమెంట్స్ , కామెడీ అంతగా బాగాలేదంటూ విమర్శలొచ్చాయి.అయితే ఈ సినిమా 2022లోనే మొదలైంది. అయితే షూటింగ్ డిలే కావడం,కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయిన రెండేళ్లకు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది .కానీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్ మరియు శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఓవర్‌సీస్ ఆడియెన్స్ మాత్రమే సింప్లీసౌత్ ఓటీటీలో ఈ హారర్ మూవీని చూడొచ్చు. ఇండియన్ ఆడియెన్స్ గార్డియన్ మూవీని చూడాలంటే మరో వారం ఎదురు చూడాలి . మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.మే 10 న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది .
Also Read
- The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
- Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ - డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
- Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
- Sardar2 : సర్దార్ -2 ఓవర్‌సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
తాజావార్తలు
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!