ఇండియన్ స్క్రీన్ పై ఒకే ఒక క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో తీసిన సినిమా ‘105 మినిట్స్’. ఉత్కంఠ భరితంగా సాగే కథ కధనం తో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో హన్సిక కథానాయిక. ‘సింగిల్ షాట్’ లో ‘సింగిల్ క్యారెక్టర్ తో రీల్ టైమ్ రియల్ టైమ్ గా తీసిన సినిమా ఇది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలో ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ మొత్తం జరిగింది. షూటింగ్ పూర్తయింది. హన్నిక పుట్టిన రోజు సందర్భంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నామని చెబుతోంది యూనిట్. బర్త్ డే సందర్భంగా హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి బర్త్ డే విషెస్ తెలియజేసారు. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.