సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివికమ్ కలిసి ‘గుంటూరు కారం’ ఘాటు ఏంటో తెలుగు సినీ అభిమానులందరికీ తెలిసేలా చేసారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన మూడో సినిమా… మాస్ మాసాల రేంజులో ఉండబోతుంది అని ఫీల్ అయిన ప్రతి అభిమానికి ఫుల్ మీల్స్ పెడుతూ ‘మాస్ కాదు మాస్ స్ట్రైక్’ అంటూ స్పెషల్ గ్లిమ్ప్స్ బయటకి వచ్చింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్… అన్నీ కలిసి ఈ మాస్ స్ట్రైక్ వీడియోని బొమ్మ దద్దరిల్లిపోయే రేంజులో మార్చాయి. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం 6:15 నిమిషాలకి బయటకి వచ్చిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్, డిజిటల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఇంకా టైం ఉంది, అప్పటివరకూ సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారు మహేష్ ఫాన్స్. మాస్ స్ట్రైక్ వీడియో రిలీజ్ అవ్వగానే టాప్ ట్రెండ్ లో పెట్టారు. 24 గంటలు తిరగకుండానే గుంటూరు కారం టైటిల్ దేశం మొత్తం మారుమోగుతోంది.
24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ గ్లిమ్ప్స్ లో అల్లు అర్జున్ పుష్ప 2కి సంబందించిన ‘వేర్ ఈజ్ పుష్ప’ 20.4 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ రికార్డ్ ని టార్గెట్ చేసిన మహేష్ ఫాన్స్ ఇప్పటివరకూ గుంటూరు కారం సినిమాకి 20 మిలియన్ వ్యూస్ ఇచ్చారు. 24 గంటలు అవ్వడానికి సమయం ఉంది కాబట్టి ఇకపై మోస్ట్ వ్యూడ్ గ్లిమ్ప్స్ అనగానే గుంటూరు కారం టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. లైక్స్ విషయంలో మాత్రం గుంటూరు కారం కాస్త వెనకపడేలానే ఉంది. ఎందుకంటే టాప్ ప్లేస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ఉంది. ఈ గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 728K లైక్స్ వచ్చాయి, ఇప్పటికీ 320K లైక్స్ దగ్గరే ఉంది కాబట్టి గుంటూరు కారం గ్లిమ్ప్స్ కి ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. మరి మహేష్ ఫాన్స్ ఒక్కసారి అలర్ట్ అయ్యి యుట్యూబ్ వైపు ఒక్క లుక్ వేస్తే, అప్పుడు మోస్ట్ లైక్డ్ గ్లిమ్ప్స్ గా కూడా గుంటూరు కారం నిలవడం పెద్ద కష్టమేము కాదు.
𝟐𝟎 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Real-time Views & Counting for Super 🌟 @urstrulyMahesh MASS STRIKE! ⚡
The Highly Inflammable #GunturKaaram 🔥 is 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 💥
▶️ https://t.co/HxmnoVf4jG#SSKForever ❤️#SSMB28MassStrike #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman… pic.twitter.com/U2vmiCY1sm
— Haarika & Hassine Creations (@haarikahassine) June 1, 2023