Guntur Kaaram Censored with U/A: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా అతడు, ఖలేజా వంటి సినిమాలు చేసిన త్రివిక్రమ్- మహేష్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. సినిమా యూనిట్ ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ, కుర్చీ మడతపెట్టి అనే మూడు పాటలు, అలాగే మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు యొక్క మాస్ అవతార్ ను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున రమణ గాడి రుబాబు ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకి యూ\ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
Niranjan Reddy: హనుమాన్ లాంగ్ రన్ ఉండే సినిమా.. బాలీవుడ్ లో బిగ్గర్ రిలీజ్.. కానీ తెలుగులో మాత్రం?
ఇక సినిమా మంచి ఎంటర్ టైనింగ్ గా ఉందని సెన్సార్ సభ్యులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ స్టెప్పులకు థియేటర్లు ఖచ్చితంగా షేక్ అవుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గుంటూరు కారం చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.