బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు అబ్బురపరిచేలా ఉన్నాయి. కొంతకాలం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడు కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తూ వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తూ వస్తున్న ఆయన ఒక బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మధ్యనే సిద్ధార్థ ఆనంద్, షారుఖ్ ఖాన్ తో పఠాన్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.
SSRMB: లోకేషన్స్ వేటలో రాజమౌళి.. వీడియో వైరల్…
ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు సిద్ధార్థ ఆనంద్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాళ్ళందరినీ కలిపి ఒక సినిమాలో నటింప చేయాలని సిద్ధార్థ ఆనంద్ భావించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక హీరోగా నటిస్తున్నట్లు ఫైనల్ చేశారు. మరో పాత్ర కోసం ప్రభాస్ ని నటించమని అడిగితే అందరూ షాక్ అయ్యే విధంగా ప్రభాస్ సినిమాకి నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి తాను మల్టీ స్టార్స్ చేసే మూడ్లో లేనని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ ఆనంద్ మరో హీరో కోసం వెతుకులాటలో పడ్డారు. అయితే ప్రభాస్ మల్టీస్టారర్ స్క్రిప్ట్ కాకుండా వేరే స్క్రిప్ట్ తో రమ్మని సిద్ధార్థ ఆనంద్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమాలు ఒప్పుకున్నాడు..