ప్రిన్స్ సరసన అతిలోకసుందరి తనయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో కథానాయికల కొరత ఉంది. అందుకే చేసిన హీరోయిన్ తో మళ్ళీ చేస్తూ వస్తున్నారు మన స్టార్ హీరోలు. అందుకే మహేశ్ ఈ సారి కొత్తగా ఆలోచిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో ఇప్పటి వరకూ మహేశ్ తో నటించని హీరోయిన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో కరిష్మా ఉన్న కథానాయికలంటే పూజా హేగ్డే, రశ్మిక మాత్రమే. కియారా రెండు సినిమాల్లో నటించి బాలీవుడ్ వైపు పరుగులు పెట్టింది. ఇక కృతి శెట్టిపై ఇంకా స్టార్ హీరోల కన్ను పడలేదు. దీంతో మన స్టార్ హీరోలు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. అలా మహేశ్ కోసం అతిలోకసుందరి తనయను రంగంలోకి దించబోతున్నారట. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కలసి 30కి పైగా సినిమాల్లో జోడీ కట్టారు. వాటిలో చాలా వరకు హిట్ చిత్రాలే. ఇప్పుడు వారి వారసులు కలసి సినిమాలో నటిస్తే అది తప్పకుండా సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందనే చెప్పాలి. అందుకే జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని మహేశ్, త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ భావిస్తోంది. గతంలో కూడా జాన్వీని తెలుగులో నటింప చేయాలని పలువురు ప్రయత్నించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మహేశ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ భావన. బాలీవుడ్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూనే వస్తోంది. మరి జాన్వీ తెలుగు లాంఛింగ్ లాంఛన ప్రాయం అవుతుందా? లేక గుసగుసలకే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!