Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లతో జోష్ పెంచాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ-2 సినిమా చేస్తున్నాడు. వరుసగా మాస్ హిట్లు కొడుతున్న బాలయ్య.. మరోసారి మాస్ మూవీని రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఆయనకు వీరసింహారెడ్డితో మంచి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడంట. రీసెంట్ గానే గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కథ కూడా బాలయ్యకు నచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఇద్దరూ రెడీ అవుతున్నారంట.
Read Also : HIT 4 : ఇట్స్ అఫీషియల్.. హిట్4 లో కార్తి పోస్టర్ రిలీజ్..
జూన్ 10న బాలయ్య బర్త్ డే ఉంది. ఆ రోజు ఈ మూవీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీంచంద్ కూడా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. రీసెంట్ గానే సన్నీడియోల్ తో మంచి హిట్ అందుకున్నాడు. అందుకే ఆయన మీదున్న నమ్మకంతో బాలయ్య వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం. అఖండ2 అయిపోయిన తర్వాత బాలయ్య సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లే నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోపీంచద్ ఈ మూవీని కూడా మాస్ యాంగిల్ లోనే రెడీ చేస్తున్నాడంట.
Read Also : Honeytrap: వృద్ధుడితో 28 ఏళ్ల యువతి అసభ్యకర చేష్టలు.. వీడియోలు తీసి రూ.50 లక్షలు డిమాండ్..!