God Movie Releasing on October 13th: తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది.
Leo: అనిరుధ్.. ఈసారి మ్యాజిక్ చేసినట్లు కనిపించడం లేదే..
ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ఇరైవన్ చిత్రాన్ని తెలుగులో గాడ్ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రన్ టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’’ అన్నారు. జయం రవి, నయనతార, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి, నరైన్, ఆశిష్ విద్యార్థి తదితరులు నటించిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: హరి కె.వేదాంతం, సంగీతం: యువన్ శంకర్ రాజా అందించారు