జబర్దస్త్ స్టేజ్ పైన రకరకాల గెటప్స్ వేస్తూ బుల్లితెర అభిమానులని మెప్పించిన కమెడియన్ ‘గెటప్ శ్రీను’. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. జాంబీ రెడ్డి లాంటి సినిమాలో గెటప్ శ్రీను సూపర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, హీరోగా మారి చేస్తున్న సినిమా ‘రాజు యాదవ్’. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో కట్ చేసిన టీజర్ చాలా బాగుంది. జబర్దస్త్ పైన చేసే యాక్టింగ్ కన్నా చాలా ఎక్కువ మెచ్యూరిటీని గెటప్ శ్రీను చూపించాడు. అతని క్యారెక్టర్ లో వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. హీరోయిన్ అంకిత ఖరత్ గ్లామరస్ గా కనిపించింది. దర్శకుడు క్రిష్ణమాచారీ ‘రాజు యాదవ్’ కథని చాలా ఎమోషన్స్ ని మిక్స్ చేసి రాసుకున్నట్లు ఉన్నాడు. ఒక యాక్సిడెంట్ కారణంగా ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపించే రాజు యాదవ్ కథలో కన్నీరు తెప్పించే బాధ కూడా ఉందని టీజర్ తోనే నిరూపించారు చిత్ర యూనిట్. ఈ మూవీ రిలీజ్ అవ్వగానే గెటప్ శ్రీనుకి మంచి యాక్టర్ గా పేరు రావడం గ్యారెంటీ.