సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న సినిమా ‘జెట్టి’. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలిచిత్రం ఇది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని సముద్ర తీర ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న వారిపై దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ లోకేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘సముద్రం బ్యాక్ డ్రాప్ లో కథలు ఎంచుకోవడం చాలా సాహసంతో కూడుకున్నది. వీరి మేకింగ్ లో చాలా ప్యాషన్ కనపడింది. వీరు ఎంచుకున్న నేపథ్యం ఖచ్చితంగా తెలుగు తెరకు కొత్తది. సుబ్రమణ్యం పిచ్చుక తనదైన ముద్రతో వస్తున్నాడు. నిర్మాత వేణు మాధవ్ గారికి, ‘జెట్టి’లో నటించిన నందితశ్వేతకు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు” అని అన్నారు.
దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ, ”త్రివిక్రమ్ గారిని కలవడం ఇదే మొదటి సారి. ఆయన మా టీం తో పంచుకున్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా టీమ్ అందరం ఆయనకు రుణపడి ఉంటాం. ‘జెట్టి’ మూవీతో ఇప్పటి వరకూ తెలుగు తెరపై కనిపించని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం” అని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది.