ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పావ్రీ హో రహీ హై’ ట్రెండ్ నడుస్తోంది. ‘బాయ్స్’ బ్యూటీ జెనీలియా కూడా తన ‘పావ్రీ హో రహీ హై’ వీడియో అప్ లోడ్ చేసింది. కానీ, పెద్ద ట్విస్ట్ ఉంది స్టోరీలో! పిల్లల కోసం రిస్క్ చేసి… పాపం మన లవ్లీ మమ్మీ… పెద్ద కష్టమే తెచ్చి పెట్టుకుంది! జెనీలియా ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. పెద్ద తెరపై కొన్నాళ్లుగా పెద్దగా కనిపించటం లేదు ఈ బ్యూటీ. అయితే, సొషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఇద్దరు పిల్లలకి తల్లి అయినా కూడా తన బబ్లీ వీడియోస్ తో జెన్నీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఓసారి ఆమె ఇన్ స్టా అకౌంట్ లోకి తొంగి చూస్తే మనకు బోలెడు ఫన్నీ వీడియోస్ దర్శనం ఇస్తాయి… తాజాగా జెనీలియా పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె ఫాలోయర్స్ ని కొంచెం షాక్ కి గురి చేసింది. ఎందుకంటే, స్కేటింగ్ చేస్తూ అమాంతం కింద పడిపోయింది జెన్నీ. దాంతో ఆమె చేతికి తీవ్రమన గాయమై పట్టి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, జరిగిందంతా సరదాగా ఓ పోస్ట్ రూపంలో వివరించింది జెనీలియా దేశ్ ముఖ్. ఆమె తన ఇద్దరు పిల్లలకి ప్రేరణగా నిలిచేందుకు స్కేటింగ్ కు సిద్ధమైందట. తాను చేస్తే వాళ్లు కూడా స్కేటింగ్ చేస్తారని భావించిందట. కానీ, తీరా చక్రాల మీద స్వారీ మొదలు కాగానే జెనీలియా అదుపు తప్పింది. క్షణాల్లో కిందపడి చేతికి గాయం చేసుకుంది. దీన్ని ‘పావ్రీ హో రహీ హై’ స్టైల్లో ప్రెజెంట్ చేసింది జెనీలియా. ‘ఇది నేను. ఇది నా స్కేటింగ్. ఇదుగో ఇలా రికవరీ అవుతున్నాను’ అంటూ అభిమానులకి చెప్పింది! అయితే, పోస్ట్ చివర్లో ఎలాగైనా తాను స్కేటింగ్ చేసి చూపిస్తానని మిసెస్ దేశ్ ముఖ్ ప్రతిజ్ఞ చేసింది. చూడాలి మరి, ఆమె సక్సెస్ ఫుల్ స్కేటింగ్ వీడియో ఎప్పుడు అప్ లోడ్ చేస్తుందో! ముందైతే తన గాయం త్వరగా నయమవ్వాలనీ మనమూ కోరుకుందాం!