Geetu Royal: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. కోట్స్ చెప్తూ ఫేమస్ అయ్యింది గీతూ రాయల్. చిత్తూరు యాసతో బిగ్ బాస్ రివ్యూలు మాట్లాడుతూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదే గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి హంగామా చేసింది. సీజన్ 7 లో శోభా ఏ రేంజ్ లో అరుస్తూ రచ్చ చేసిందో .. సీజన్ 6 లో గీతూ అలా రెచ్చిపోయింది. ఇక సీజన్ 7 కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయడానికి హోస్ట్ గా మారిన గీతూ.. కంటెస్టెంట్లను కడిగిపడేసింది. అభిమానుల బుర్రల్లో ఉన్న ప్రతి ప్రశ్న.. అది కష్టమైనదా.. అడగకూడనిదా.. ? అనేది లేకుండా మొత్తం అడిగేసి వారికి చెమటలు పట్టించింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో గీతూ .. నాగార్జున హోస్ట్ గా ఫెయిల్ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన కన్నా ఇంటర్వ్యూలో తానే బాగా ప్రశ్నలు అడిగినట్లు చెప్పుకొచ్చింది.
” బిగ్ బాస్ లో అసలు ఏం జరుగుతుంది అనేది బయట ఎవరికి తెలియదు. గంట ఎపిసోడ్ చూసే జనాలలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. వాటిని శనివారం నాగార్జున వచ్చి అడుగుతాడు అని అనుకుంటారు. కానీ, ఆయన అడగరు. ఎందుకంటే ఆయన ఎపిసోడ్స్ చూడరు. అది కూడా స్క్రిప్ట్ అని నాకు అప్పుడు తెలియదు. ఇప్పటివరకు నాగార్జున అన్ని సీజన్స్ లోనూ అవే చప్ప ప్రశ్నలు వేశారు. ఈ సీజన్ లోనే ఆయన గట్టిగా మాట్లాడారు. ఆయనకు ఒక స్క్రిప్ట్ వస్తుంది. దాన్నే బట్టే ప్రశ్నలు అడుగుతారు. దీనివల్లనే నాగార్జు హోస్ట్‌గా ఫెయిలయ్యారనే చెప్తున్నాను. ఆయన అడగాల్సిన ప్రశ్నలను నేను నా ఇంటర్వ్యూస్ లో అడిగాను. నేను బిగ్ బాస్ హూసు లో ఉన్నప్పుడు కూడా నేను చేయని తప్పును నా చేతనే ఒప్పించారు. అది నేను ఇప్పటికీ చెప్తాను.అలాంటివి జరిగినప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకుని ఏది కరెక్ట్? ఏది తప్పు? అనేది గట్టిగా చెప్తే బాగుండేది అనుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాను.