Geetu Royal : బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. గీతూ రాయల్ లైఫ్ కొటేషన్లు కూడా చెబుతోంది. అలాంటి ఆమె.. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నేను బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్నప్పుడు కచ్చితంగా గెలుస్తాను అని అనుకున్నా. కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయాను. అది నన్ను చాలా బాధ పెట్టింది. జనాలు ఒక వ్యక్తి ఏడిస్తే తట్టుకోలేరు. కానీ అతను ఎందుకు ఏడుస్తున్నాడు అనేది పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా బాలాదిత్య కోసం నన్ను ఎలిమినేట్ చేసేశారు’ అంటూ తెలిపింది.
Read Also : HIT 3: నాని ‘రా’ సినిమాకి సెన్సార్ కష్టాలు?
బిగ్ బాస్ జరుగుతున్న టైమ్ లో మా ఇంట్లో చాలా గొడవలు వచ్చాయి. ఒకానొక టైమ్ లో చనిపోదాం అనుకున్నా. తలను గోడకేసి కొట్టుకోవాలి అనిపించింది. కానీ ఆగిపోయా. నేను డిప్రెషన్ లో ఉన్న టైమ్ లో కూడా టీవీలో షోలలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. నా భర్త వికాస్ కు నాకు చాలా గొడవలు అయ్యాయి. కానీ మేం ఎప్పుడూ కలిసే ఉంటాం. గొడవలు జరిగినా వెంటనే కలిసిపోతాం. అతని కోసమే చాలా షోలు వదిలేసుకున్నాను. ఎంటర్ టైన్ చేయడం కోసం వేరే దారులు చాలానే ఉన్నాయి. అందుకే నా భర్తకు ఇష్టం లేని వాటి జోలికి నేను పోను’ అంటూ తెలిపింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె మూడు షోలలో పాల్గొంటోంది.