ఇటీవలే నాచురల్ స్టార్ నాని, కోర్ట్ అనే సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, సినిమా రిలీజ్ అవ్వడానికి సుమారు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మే ఒకటవ తేదీన సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. తాజాగా, నిన్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. దానికి నాని సహా దర్శకుడు కూడా హాజరయ్యారు. సాధారణంగా, సినిమా రిలీజ్‌కు వారం ముందు మాత్రమే సెన్సార్ స్క్రీనింగ్ జరుగుతుంది. కానీ, నాని సినిమాకి మాత్రం ఏకంగా మూడు వారాల ముందే స్క్రీనింగ్ జరపడం గమనార్హం.
Mamata Banerjee: “వక్ఫ్ చట్టాన్ని” బెంగాల్‌లో అమలు చేయం, అల్లర్లు దేనికి.?
దానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. అదేంటంటే, సెన్సార్ టీమ్ చూసి సినిమాలో ఏమైనా అభ్యంతరాలు లేదా కట్స్ చెబితే, ఆ మార్పులు, చేర్పులు చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినీ హిస్టరీలోనే ఒక వైలెంట్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్ జరుగుతున్నాయి. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసిన తర్వాత ఎలాంటి వివరాలు బయట మాట్లాడలేదని తెలుస్తోంది. నాని అండ్ టీమ్, ఒకవేళ ప్రస్తుత సెన్సార్ టీమ్ కనుక ఎక్కువ కట్స్ చెబితే, దాన్ని రివిజన్ కమిటీ ముందుకు పంపించే ఆలోచనలో కూడా ఉన్నారు. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి గట్టిగానే కట్స్ చెప్పొచ్చని అంచనాలు ఉన్నాయి. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నాని తన సొంత వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. హిట్ రెండు భాగాలు సూపర్ హిట్ కావడంతో, మూడో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి.