Sunil movies back to back: ‘గీత’ ఆగమనానికి ముహూర్తం కుదిరింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil movies back to back: ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా ‘గీత’. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన ఈ చిత్రంలో ‘గీత’గా టైటిల్ రోల్ ప్లే చేసింది ప్రముఖ కథానాయిక హెబ్బా పటేల్. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఈ మూవీ ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ‘గీత’ సినిమాను ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో పోషించడం ఓ విశేషం కాగా, సునీల్ ఓ ప్రధానమైన పాత్రలో కనిపించబోతున్నారు. అలానే ‘నువ్వే కావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలలో హీరోగా నటించిన సాయికిరణ్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, ”ఈ సినిమా అవకాశం నా గురువు, దైవ సమానులు వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓ సామాజికాంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా కథ తయారు చేశాను. సుభాష్ ఆనంద్ సంగీతం, చిన్నా నేపథ్య సంగీతం మూవీకి హైలైట్ గా నిలుస్తాయి” అని అన్నారు. నిర్మాత ఆర్. రాచయ్య మాట్లాడుతూ, ”గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే.. ‘గీత’ చిత్రం ఈ నెల 26న వస్తోంది. దానిలో సునీల్ ఓ కీలకమైన పాత్ర పోషించారు. అలానే ఈ నెల 27న సునీల్ కీ-రోల్ ప్లే చేసిన మరో సినిమా ‘బుజ్జి ఇలా రా’ రిలీజ్ కాబోతోంది. ఆ రకంగా సునీల్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?