సౌత్ ఇండస్ట్రీ ఫేమస్ డైరెక్టర్ లలో గౌతమ్ మీనన్ ఒకరు. తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో మరింత హిట్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నడు గౌతమ్. ఆయన దర్శకుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కూడా నటించాడు. అయితే కొన్నాళ్లుగా గౌతమ్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అసహనం వ్యక్తం చేశారు.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ ‘ ఈ విషయాల గురించి మీతో పంచుకోవద్దు అని అనుకున్నా కానీ ఎంతో బాధగా ఉంది. ఇండస్ట్రీలో నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. మీకు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. నేను తీసిన ‘ధ్రువ నక్షత్రం’ విడుదల విషయంలో సమస్యల గురించి ఎవరూ స్పందించలేదు. కనీసం ఆ మూవీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ధనుష్, లింగుస్వామి మాత్రమే దాని గురించి అడిగారు. విడుదల చేయడానికి ప్రయత్నించారు. కొన్ని స్టూడియోల వారికి ఈ సినిమాను చూపించాను. ఎవరూ దాని స్వీకరించలేదు. విడుదల చేయడానికి ముందుకు రాలేదు. కానీ ప్రేక్షకులు ఇంకా నా సినిమాలు చూడాలని కోరుకుంటున్నారు. వారి కోసమే నేను బతికి ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మాటలు విన్న ఆయన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.