Gautham Karthik: కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కార్తీక్ తనయుడు, హీరో గౌతమ్ కార్తిక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లి కొడుకు కానున్నట్లు చెప్పుకొచ్చాడు. సీతాకోక చిలుక, అన్వేషణ, అభినందన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీక్ కొడుకే గౌతమ్ కార్తీక్. కడలి సినిమాతో గౌతమ్ కూడా తెలుగువారికి పరిచయమే. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న గౌతమ్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే అందులో నిజం లేదని, ఇలాంటి వార్తలు రాసి తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని మంజిమా క్లారిటీ ఇచ్చింది.
ఇక తాజాగా గౌతమ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు చెప్పుకొచ్చిన గౌతమ్.. వధువు ఎవరో అనేది మాత్రం చెప్పలేదు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లా..? లేక ప్రేమ పెళ్లా..? అనేది కూడా తెలియాల్సి ఉంది. మంజిమా మోహన్ కేవలం తనకు స్నేహితురాలే అని చెప్పడంతో వధువు ఆమె అయ్యి ఉండదని చెప్పుకొస్తున్నారు. మరి ఈ కుర్ర హీరో వివాహమాడే ఆ బ్యూటీ ఎవరు అనేది తెలియాలంటే హీరో అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే..