Gauri Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంత ఫేమసో.. ఆయన సతీమణి గౌరీ ఖాన్ కూడా అంతే పాపులర్ సెలబ్రిటీ. నిర్మాతగా, బిజినెస్ విమెన్ గా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆమె తాజాగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్.. ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే షో లో కనిపించి హంగామా చేసింది. ఇక తాజాగా షారుక్ భార్యగా, నిర్మాతగా కాఫీ విత్ కరణ్ షో లో అడుగుపెట్టిన గౌరీ భర్త గురించి, కూతురు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. భర్త షారుఖ్ గురించి చెప్పమంటే.. షారుఖ్ తో పార్టీ అంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
“షారుఖ్ ఇంట్లో పార్టీ చేస్తే నాకు చాలా భయం. వచ్చిన అతిధులను కారు వద్ద దింపేవారకు వెళ్తాడు. ఇక ఇంట్లో ఎక్కడా కనిపించడు. ఒక్కోసారి నాకు రోడ్డు మీదనే పార్టీ చేసుకున్నామా..? అని అనిపిస్తుంటుంది. ఇక లోపల ఉన్నవారు షారుఖ్ ఎక్కడా అని అడిగినప్పుడు చెప్పడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాటల్లో చెప్పలేను” అని చెప్పుకొచ్చింది. ఇక తమ పెళ్లి కూడా ఎంతో విచిత్రంగా జరిగిందని చెప్పుకొచ్చిన గౌరీ.. మా పెళ్లి గురించి చెప్పినప్పుడల్లా దిల్ వాలే దుల్హేనియా లేజాయంగే సినిమా గుర్తొస్తుందని చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు సుహానా ఖాన్ కు రిలేషన్ గురించి ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే.. ” సుహానా.. ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయకు..” అని చెప్తున్నా అని తెలిపింది. దీంతో బాలీవుడ్ మామ్స్.. కూతుర్లకు ఇంతకంటే ఎక్కువ ఏం సలహాలు ఇస్తారులే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.