ఆఫ్ఘన్ కాందిశీకుల వెతలపై ‘గార్డ్’ చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా ‘అటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న అజయ్ కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుభాష్ కాలేతో కలిసి భారీ స్థాయిలో ‘గార్డ్’ మూవీని నిర్మించబోతున్నాడు. ఆఫ్ఘన్ కాందిశీకుల వేతల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ ప్రకటనతో పాటు నిర్మాతలు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పరమాణు’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, ‘బేబీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ తర్వాత ఆ తరహాలోనే ‘అటాక్’, ‘గార్డ్’ చిత్రాలను అజయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక సుభాష్ కాలేతో కలిసి ‘రాయ్’, ‘ఆల్ ఈజ్ వెల్’ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘గార్డ్’ కోసం జత కట్టడం విశేషం.
Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ
Also Read
- Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
- Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
- Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
- Ananta Sriram: 'పెద్ది' ఐటమ్ సాంగ్ విమర్శలపై ఇచ్చిపడేసిన అనంత శ్రీరామ్.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’!
‘గార్డ్’ మూవీ గురించి అజయ్ కపూర్ మాట్లాడుతూ, ”సుభాష్, నేను కలిసి కొన్నేళ్ళుగా ప్రయాణం సాగిస్తున్నాం. అతను ఇటీవల ‘గార్డ్’ స్క్రిప్ట్ చెప్పగానే నాకు నచ్చేసింది. వెంటనే అంగీకారాన్ని తెలిపాను. ఈ కథలో భావోద్వేగాలతో పాటు దేశభక్తి పూరితమైన అంశాలు, స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. ఈ కథకు సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం ఈ సినిమాను భారీగా ప్లాన్ చేశాం” అని అన్నారు. మరో నిర్మాత సుభాష్ కాలే మాట్లాడుతూ, ”’గార్డ్’ నాకు వెరీ స్పెషల్ ప్రాజెక్ట్. ఈ కథ మీద కొంతకాలంగా వర్క్ చేస్తూ ఉన్నాను. దీనికి అజయ్ కపూర్ లాంటి నిర్మాత సాయం దొరకడం ఆనందంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను అంతర్జాతీయ స్థాయిలో తెరపై చూపించాలన్నది మా కోరిక’ అని అన్నారు.
ఈ చిత్రం కోసం ‘మేరా భారత్ హై మహాన్’ అంటూ ఓ నేపథ్య గీతాన్ని ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ‘మిషన్ మంగళ్’కు రచన చేసిన నిధి సింగ్ ధర్మా వర్క్ చేశారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులతో పాటు దర్శకుడి వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఆగస్ట్ 15న విడుదల స్వాతంత్రదినోత్సవ కానుకగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డు..
-
Healthy Protein Laddu: పిల్లల్లో జ్ఞాపకశక్తి, తెలివితేటలను పెంచే హెల్తీ ‘ప్రోటీన్ లడ్డు’.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!