పలు సినిమాలతో నటుడిగా తనని తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు
. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట ఇప్పటికే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దాంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కాగా శనివారం హీరో లక్ష్ చదలవాడ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.
వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వచ్చిన లక్ష్ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’లో కూడా కొత్త రకమైన, ప్రేక్షకులు మెచ్చే క్యారెక్టర్ ను చేస్తున్నాడు. ఈ సినిమా లోని పాత్ర కోసం ఆయన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ లో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ సినిమాను ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పూర్తయ్యిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రం బాలెన్స్ ఉందని, అతి త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు.