సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. సౌత్ ఇండియా మొత్తంలో అన్ని ఇండస్ట్రీల్లో 50 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఏకైక తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్, ఓవర్సీస్ లో మాత్రమే 190 కోట్లకి పైగా కలెక్ట్ చేసిందంటే జైలర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. రజినీ కంబ్యాక్ ఫిల్మ్ గా నిలిచిన జైలర్ సినిమా ఇప్పటికీ మంచి బుకింగ్స్ ని రాబడుతూ 625 కోట్లకి చేరువలో ఉంది. ఇప్పట్లో జైలర్ కలెక్షన్స్ బ్రేక్ అవ్వవు అనుకుంటున్న సమయంలో కేవలం నార్త్ కలెక్షన్స్ తోనే జైలర్ కలెక్షన్స్ ని దాటింది గదర్ 2 మూవీ.
ఓవర్సీస్ నుంచి అసలు కలెక్షన్స్ ని రాబట్టలేకపోతున్న ఈ మూవీ హిందీ బెల్ట్ ని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఫేడ్ అవుట్ అయిన సన్నీ డియోల్ ఈరోజు టాప్ స్టార్స్ కలెక్షన్స్ ని చెల్లా చెదురు చేస్తున్నాడు. దంగల్, KGF 2 లాంటి సినిమాల కలెక్షన్స్ ని మూడు వారాలు తిరగకుండానే గదర్ బ్రేక్ చేసింది. గదర్ 2 అసలు బాక్సాఫీస్ దగ్గర స్లో అవుతున్నట్లు కూడా అనిపించట్లేదు. 650 కోట్ల కలెక్షన్స్ ని ఒక వెటరన్ హీరో రాబట్టాడు అంటే గదర్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గదర్ 2 ఇదే జోష్ ని మరో వారం పాటు కొనసాగించనుంది, ఆ తర్వాత నుంచి కింగ్ ఖాన్ జవాన్ గా డ్యూటీ ఎక్కనున్నాడు. సెప్టెంబర్ 7న జవాన్ రిలీజ్ అయ్యేవరకూ గదర్ 2 ఫైనల్ కలెక్షన్స్ ఎంత రాబడుతుంది అనేది చూడాలి.