Forest Officials Arrested three members tried to enter Manjummel Boys Guna Cave: చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ కేరళ, తమిళనాడులో బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. కమల్ హాసన్ సినిమా గుణ, సినిమా షూటింగ్ జరిగిన కొడైకెనాల్ లోని ఒక కేవ్ సినిమాలో ప్రధాన అంశం కావడంతో అది ఇప్పుడు మరింత పాపులర్ అయింది. సినిమా హిట్ కావడంతో ఇప్పుడు కొడైకెనాల్‌లోని గుణ గుహను సందర్శించేందుకు చాలా మంది వస్తున్నారు. ఇదిలా ఉండగా గుణ గుహ లోపల మళ్ళీ ప్రమాదం జరగనుందని అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తాజాగా గుణ గుహలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను తమిళ అటవీ శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గణ గుహలో ఏర్పాటు చేసిన భద్రతా కంచెను దాటి గుహలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను పెట్రోలింగ్ అటవీ అధికారులు అడ్డుకున్నారు. 24 ఏళ్ల భరత్, విజయ్, రంజిత్‌లను అటవీ అధికారులు పట్టుకున్నారు.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డు.. ఇండియాలోనే ఏకైక హీరో!
ముగ్గురూ తమిళనాడులోని కృష్ణగిరి వాసులు. మంజుమ్మేల్ బాయ్స్ సినిమా హిట్ అయిన తర్వాత గుణ గుహకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు 4,000 మందికి పైగా గుణ గుహను సందర్శిస్తున్నారని అటవీ శాఖ అధికారులు తెలిపారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. గుణ గుహ అనేది మూడు రాతి స్తంభాలతో ఏర్పడిన గుహ. బ్రిటిష్ వారు ఈ గుహను డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ గుహలో కమల్ హాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పుడు డెవిల్స్ కిచెన్ అనే పేరు గుణ గుహగా మారింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఈ గుహలోని కొన్ని గుంటలలో పడి సుమారు 13 మంది మరణించారు. అయితే ఎర్నాకుళంలోని మంజుమ్మేల్ కి చెందిన సుభాష్ గుహలోపల ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్. ఈ సినిమా గ్లోబల్ గ్రాస్ కలెక్షన్ 160 కోట్లు దాటింది. కేరళలో ఈ సినిమా 54 కోట్లు, తమిళనాడులో 40 కోట్లకు పైగా వసూళ్లు,కర్ణాటక నుంచి దాదాపు పది కోట్లు రాబట్టింది. తర్వాత ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ 160 కోట్లు దాటేసింది. ఇక తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.