ట్రైలర్ టాక్: ఒక అమాయకుడిని దేశ ద్రోహిగా మారిస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, మంజిమ మోహన్ జంటగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ ఐ ఆర్’. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ విష్ణు విశాల్ బ్యానర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఐఎస్ ఐ టెర్రిరిజమ్ నేపథ్యంలో సాగే కథగా ట్రైలర్ ని ఓపెన్ చేశారు. టెర్రరిజం పెరగాలి అని బాంబ్ బ్లాస్ట్ లు చేసే ఒక వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. అయితే ఆ కరుడు గట్టిన టెర్రరిస్ట్.. హీరోనే అనుకోని అతడిని ఫాలో అయ్యి ఒకనాకొక దశలో అరెస్ట్ చేస్తారు. అప్పటివరకు ఎంతో హ్యాపీగా ఉన్న అతడి జీవితం తలకిందులవుతుంది. అమాయకుడిగా ఉన్న అతడిపై దేశ ద్రోహి ముద్ర పడుతుంది. ఇక తనను అంతగా వేధించిన ఈ పోలీస్ వ్యవస్థపై ఆ అమాయకుడు రివెంజ్ తీర్చుకోవడానికి నిజంగానే టెర్రరిస్ట్ గా మారి పోలీసులను ముప్పుతిప్పలు పెడతాడు.
అస్సలు పోలీసులు వెతుకుతున్న కరుడు గట్టిన టెర్రరిస్ట్ ఎవరు..? అతనికి, హీరోకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు హీరో నిర్దోషి అని నిరూపించుకున్నాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక అమాయకుడిగా, టెర్రరిస్ట్ గా విష్ణు విశాల్ నట అద్భుతమని చెప్పాలి. పోలీస్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమ మోహన్ లాయర్ గా కనిపించి మెప్పించారు. ఇక మరో హీరోయిన్ రెబా మోనికా జాన్ కూడా బాగా నటించింది. టెర్రరిజమ్ కారణంగా ఓ అమాయకుడు ఎదుర్కొన్న పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. తెలుగు తమిళ భాషల్లో ఫిబ్రవరి 11న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో విష్ణు మరో హిట్ ని అందుకొని రవితేజకు కూడా హిట్ ని అందిస్తాడేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!