Sreeleela: పెళ్లిసందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. లేలేత అందాలను హద్దులేకుండా చూపించి కుర్రకారును ఆకర్షించిన ఈ బ్యూటీ సినిమా విజయంతో పనిలేకుండానే క్రష్ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.. ఒక్కసారిగా రాఘవేంద్ర రావు పరిచయం చేసిన హీరోయిన్ అయ్యేసరికి స్టార్ హీరోల చూపంతా అమ్మడిపైనే పడింది. ఇంకేముంది వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పటికే ధమాకా చిత్రంలో ఛాన్స్ పట్టేసిన ఈ భామ ఇటీవలే రామ్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రొఫెషనల్ విషయాలను పక్కన పెడితే శ్రీ లీల తల్లి స్వర్ణ లతపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. ఆ కేసు పెట్టింది స్వయానా ఆమె భర్త, శ్రీ లీల తండ్రి శుభాకర్ రావు కావడం షాకింగ్ కు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీ లీల తల్లిదండ్రులు స్వర్ణ లత, శుభాకర్ రావు పెళ్ళైన కొన్నేళ్ళకే విబేధాల వలన విడిపోయారు. శ్రీ లీల తల్లిదగ్గర పెరిగింది. గత 20 ఏళ్ళ నుంచి వీరు ఒకరికొకరు సంబంధం లేకుండానే బతుకుతున్నారు. కాగా, ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 2 న స్వర్ణ లత, భర్త శుభాకర్ రావు ఇంటిపై దాడికి పాల్పడింది. తాళం వేసి ఉన్న ఇంటిని పగులకొట్టి లోపలి వెళ్లి వస్తువులను చిందరవందరగా చేసిందని శుభాకర్ రావు అడుగోడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇక కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో శుభాకర్ రావు .. శ్రీ లీల అసలు తన కూతురే కాదని గొడవ చేసిన విషయం విదితమే. అప్పట్లో శ్రీ లీల ఇంటి వివాదం హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు మరోసారి నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.