యాబై ఏళ్ల చరిత్రగల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగాగెలుపొందిన విష్ణు మంచుని అక్టోబర్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు, అధ్యక్షుడు ఏ. ప్రభు, కార్యదర్శి పర్వతనేని రాంబాబుతో పాటు మాజీ అధ్యక్షుడు సురేష్ కొండేటి, మా కోశాధికారి శివబాలాజీ, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అబ్దుల్, మల్లికార్జున్, జిల్లా సురేష్, కుమార్, వీర్ని శ్రీనివాస్, నవీన్, మురళి పాల్గొన్నారు. అనంతరం కె. లక్ష్మణరావు విష్ణు మంచును శాలువతో సత్కరించగా, అధ్యక్షుడు ప్రభు, కార్యదర్శి రాంబాబు బొకేతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభు మాట్లాడుతూ ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని అలంకరించినటువంటి మంచు విష్ణు అభినందించడం హ్యాపీగా ఉంది. మన అసోసియేషన్ యాబై సంవత్సరాలు పూర్తయిన ట్రెడిషనల్ ఆర్గనైజేషన్. మొదటి నుండి చిత్ర పరిశ్రమకు, ప్రజలకు మధ్య వారధిగా గొప్ప చరిత్రకలిగిన అసోసియేషన్. గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాలు చలనచిత్ర జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ ద్వారా సన్మానం జరిగితే దానికొక విలువ, గౌరవం ఉంటాయని భావించి తనకై తాను ప్రతిపాదించుకొని ఆ గౌరవాన్ని పొందారు.
Read Also : తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”
అలాంటి ఘనత,చరిత్ర ఉన్న కలిగినది ఫిల్మ్ క్రిటిక్స్. మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుకి మేము చేస్తున్న తొలి సన్మానం ఇది. ఆయన కెరీర్ పరంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజయాల పరంగా ఎన్నెన్నో సక్సెస్ లు సాధించాలి. మా ప్రతిష్ఠతని, గౌరవాన్ని ఇంకా అభివృద్ది పరచాలి’ అన్నారు. మా నూతన అధ్యక్షుడు విష్ణు మంచు మాట్లాడుతూ ‘ముందుగా నాకు ఈ సన్మానం చేసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కి థాంక్స్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎంతో మంది జర్నలిస్ట్ ల కళ్ళముందు పెరిగాను. అలాంటిది ఇవాళ నాకు వాళ్ళు సన్మానం చేయటం చాలా హ్యాపీగా ఉంది. మనందరం ఒకే కులం.. సినిమా కులం. అందరికి కష్ట సుఖాలు ఉంటాయి. జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్. భారతదేశంలో తెలుగు సినిమా మీడియా ఉన్నది ఉన్నట్లు చూపించి హద్దులు దాటకుండా కవర్ చేస్తుంది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు ‘మా’ సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అన్నారు. మా కోశాధికారి శివ బాలాజీ మాట్లాడుతూ ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు మంచు విష్ణును సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. మన హీరోయిన్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థమ్బ్ నైల్స్ వలన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని నియంత్రించేందుకు మీడియా సహకారం కావాలి. పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.