అడవి శేష్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘హిట్ 2’. నాని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ‘హిట్ ఫ్రాంచైజ్’ లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో వీలైనన్ని ములుపు ఉండేలా చూసుకోవడం. అలానే థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ లని బయటకి చెప్పక పోవడం, ఒకవేళ రివ్యూ ఇవ్వాల్సి వచ్చినా నాన్ స్పాయిలర్ రివ్యూ ఇవ్వడం. ఇది మర్చిపోయి… ‘హిట్ 2’ సైకో కిల్లర్ ఇతనే, ‘హిట్ 3’లో హీరో ఇతనే క్లైమాక్స్ లో రివీల్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్తున్నాం అనే విషయం కూడా మరిచిపోయిన కొందరు సినీ అభిమానులు ఫోన్ లో వీడియోస్ తీసి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి ట్విస్ట్ లన్నీ లీక్ చేస్తున్నారు. ఇది థ్రిల్లర్ సినిమా, ట్విస్ట్ లీక్ చేస్తే మన తర్వాత సినిమాకి వచ్చే ఆడియన్స్ కి కిక్ ఉండడు, సర్ప్రైజ్ మిస్ అవుతాడు అనే విషయాన్ని మర్చిపోయి… అత్యుత్సాహంతో కొందరు చేస్తున్న ఈ పని వాళ్ల సినిమాపై ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం ఉంది. ‘హిట్ 2’ రిలీజ్ కి ముందు నుంచీ చిత్ర యూనిట్ ట్విస్ట్ లు లీక్ చెయ్యొద్దు, ఇది మా రెండేళ్ల కష్టం అంటూ దండం పెట్టి అడిగింది. ఒక్కరు కూడా వినకుండా, ‘హిట్ 3’ హీరో ఇతనే అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మంచి సినిమాని మనలాగే అందరూ చూడాలి అనుకుంటారు, వాళ్లకి స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉంటే సినిమాని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి సినీ అభిమాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది.