February Films of Malayalam Became Super hits: ఓటీటీ పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు అలవాటయ్యారు. ఇప్పుడు మలయాళ సినిమాలను సైతం హైదరాబాద్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య సిటీలలో రిలీజ్ చేసేందుకు మలయాళం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి టాక్ బావుందంటే తెలుగు ప్రేక్షకులు సైతం సబ్ టైటిల్స్ తో ఆ సినిమా చూసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫిబ్రవరి నెలలో మలయాళ సినీ పరిశ్రమకు మూడు హిట్లు దొరికాయి. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయిన ప్రేమలు, ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ అయిన భ్రమ యుగం, ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు మంచి కలెక్షన్స్ సైతం అందుకుంటున్నాయి. ప్రేమలు సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కొందరు తెలుగు దర్శక నిర్మాతలు.
Actor Arrest: పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారం.. ప్రముఖ నటుడి అరెస్ట్..
ఇక భ్రమ యుగం సినిమా తెలుగులో రిలీజ్ అయింది కూడా. అయితే మంజుమ్మేల్ బాయ్స్ రిలీజ్ అయ్యి రెండు రోజులే కావడంతో త్వరలోనే దాన్ని కూడా తెలుగుకి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేయొచ్చు. అయితే ఇలా మలయాళ సినీ పరిశ్రమ మూడు హిట్లతో విరాజిల్లుతుంటే తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఈ ఫిబ్రవరి ఆశాజనకంగా లేదని బాధపడుతోంది. నిజానికి ఈ ఫిబ్రవరి నెలలో 9వ తేదీన ఈగల్, 16వ తేదీన ఊరి పేరు భైరవకోన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కలెక్షన్స్ కూడా మంచిగా వచ్చాయి. కానీ ఆశించిన మేర రాలేదనే టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరిలో తెలుగు మొత్తం మీద చెప్పుకోదగ్గ సినిమాలు ఇవి రెండే రిలీజ్ అయ్యాయి. అలా ఒకపక్క మలయాళ సినీ పరిశ్రమ మంచి జోష్ లో ఉంటే తెలుగు సినీ పరిశ్రమ మాత్రం నిరాశలో ఉందని చెప్పక తప్పదు