‘పుష్ప’ ఫైర్ అంటుకుంది… సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో సామ్ చేసిన స్పెషల్ సాంగ్ కు ఎలాంటి స్పందన వస్తుందా ? అని టాలీవుడ్ ఆతృతగా ఎదురు చూస్తుండగా… ఆ టైం రానే వచ్చింది. ఈ ఐటెం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేసినప్పటి నుంచే హైలెట్ అవ్వగా… లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొంతమంది ‘ఉఊ’ అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా సాంగ్ పై కేసు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ‘పుష్ప’రాజ్ ఫైర్, సమంత గ్లామర్ కు అంతా ఫిదా అయ్యారని అన్పిస్తోంది. థియేటర్లో ‘ఊ అంటావా మామా ఉఊ అంటావా’ అనే సాంగ్ వచ్చినప్పుడు అభిమానుల సందడి ఎలా ఉందో తెలియజేస్తూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Read also : థియేటర్ లో అల్లు అర్జున్… పోటెత్తిన ఫ్యాన్స్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కుడి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ ఈరోజు స్వయంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాను అభిమానులతో కలిసి వీక్షించడానికి వెళ్లారు. అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు కూడా చేరుకున్నారు.