సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ‘ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్ ట్రాట్టింగ్ కథని మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తాన”ని రాజమౌళి ఇప్పటికే చెప్పి SSMB 29 ప్రాజెక్ట్ పై ప్రపంచ సినీ అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో ‘SSMB29’ని కూడా ఒక ఫ్రాంచైజ్ లా చెయ్యాలనేది జక్కన ప్లాన్. సీక్వెల్, ప్రీక్వెల్ అనేలా కాకుండా ఒక వరల్డ్ ని క్రియేట్ చేసి అందులో నుంచి సినిమా చెయ్యాలని జక్కన ప్లాన్ చేస్తున్నాడట. మన దగ్గర ఫ్రాంచైజ్ లు ఉన్నాయి కానీ లార్జ్ స్కేల్ లో రూపొందిన ఫ్రాంచైజ్ లు అయితే లేవు. రాజమౌళి, మహేశ్ లు ఫ్రాంచైజ్ ని చేస్తున్నారు అనేది నిజమైతే… ఈ సినిమా వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం గ్యారెంటీ.
ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక, రాజమౌళి -మహేశ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవనుంది. దాదాపు 2023 డిసెంబర్ నుంచి ‘SSMB 29’ వర్క్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. లేటెస్ట్ గా SSMB29 ప్రాజెక్ట్ AI స్కెచ్ ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్ AI టెక్నాలజీతో మహేష్ ఇమేజినరీ లుక్ ని డిజైన్ చేసి, ఆ స్కెచ్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వీటిని చూసిన ఫ్యాన్స్ SSMB 29 హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ లుక్ లో మహేష్ బాబు SSMB 29 సినిమా చేస్తే మిషన్ ఇంపాజిబుల్, ఇండియానా జోన్స్ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వడం గ్యారెంటీ. మరి జక్కన్న కాస్త వైరల్ అవుతున్న ఈ మహేష్ కొత్త లుక్స్ ని చూడన్నా…