ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రెస్టీజియస్ ఆస్కార్ కి కూడా ఇండియాకి తీసుకోని వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక సినిమాలో నటించడం అనేది చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చరణ్-ఎన్టీఆర్ లు కలిసి సినిమా చెయ్యడం అనేది బిగ్గెస్ట్ రిస్క్. ఆ రిస్క్ ని ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చరణ్-ఎన్టీఆర్ లు ఫేస్ చేస్తూనే ఉన్నారు. చరణ్ బాగా చేసాడని మెగా ఫ్యాన్స్… ఎన్టీఆర్ దుమ్ములేపాడని నందమూరి ఫ్యాన్స్ క్రెడిట్స్ కోసం సోషల్ మీడియాలో వార్ కి దిగుతూనే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు లేకున్నా ఆర్ ఆర్ ఆర్ సినిమా అంత గొప్పగా ఉండదు అనే విషయాన్ని మర్చిపోయి, మా హీరో బాగా చేసాడు అంటే కాదు మా హీరోనే బాగా చేసాడు అంటూ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.
ఎవరు మెయిన్ హీరో, ఎవరు సైడ్ హీరో విషయంలో పెద్ద పెద్ద డిబేట్స్ కూడా జరిగాయి. సరేలా తరతరాలుగా ఉన్న ప్రొఫెషనల్ రైవల్వ్రీ కదా అభిమానులు అలా ఉండడంతో తప్పు లేదు అనుకోని అందరూ ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో గత కొన్ని రోజులుగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఎలాంటి గొడవలూ జరగట్లేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ ఫ్యాన్ వార్ పీక్ స్టేజ్ లో జరుగుతూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. ఈరోజు సాయంత్రం 69వ నేషనల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేస్తారు కాబట్టి ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ ‘బెస్ట్ హీరో’ కేటగిరిలో మా హీరో అవార్డు వస్తుంది అంటే కాదు మా హీరోకే నేషనల్ అవార్డు వస్తుందని సోషల్ మీడియాలో డిబేట్స్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక అవార్డ్స్ ప్రకటించి, అందులో చరణ్ కో ఎన్టీఆర్ కో బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డ్ వస్తే ఫ్యాన్ వార్ ఇంకే రేంజులో జరుగుతుందో చూడాలి.