యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నాడు అద్భుతమైన ట్రీట్ రాబోతోంది. అక్టోబర్ 13న ప్రభాస్ బర్త్ డే కాగా… ఇప్పటికే అభిమానులు ట్విట్టర్ లో ‘ప్రభాస్ బర్త్ డే మంత్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇటీవల “రాధేశ్యామ్” నిర్మాతలు సినిమాను వచ్చే ఏడాది జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ‘రాధే శ్యామ్’ ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు.
Read also : “కొండపొలం” ఫస్ట్ రివ్యూ
తాజా సమాచారం ప్రకారం ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13న విడుదల కానున్న మినీ టీజర్‌తో అదే విషయాన్ని టీమ్ ధృవీకరిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’లో జగపతి బాబు, జయరామ్, సచిన్ ఖేడేకర్, భీనా బెనార్జీ, సత్యరాజ్, భాగ్యశ్రీ, మురళీ శర్మ, శశా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సత్యన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “రాధే శ్యామ్” వచ్చే ఏడాది తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది.