“కొండపొలం” ఫస్ట్ రివ్యూ

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “కొండపొలం” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ట్వీట్ చేశారు. నిన్న ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూను ప్రదర్శించగా చిత్రబృందంతో కలిసి మెగాస్టార్ వీక్షించారట. “ఇప్పుడే ‘కొండపొలం’ చూశాను. ఒక శక్తివంతమైన సందేశంతో కూడిన అందమైన గ్రామీణ ప్రేమ కథ. క్రిష్ ఎప్పుడూ విభిన్న కళా నైపుణ్యాలను, సంబంధిత సమస్యలను ఎంచుకుని, కళాకారుల నుండి అద్భుతమైన ప్రదర్శనలను వెలికి తీసే విధానం నాకు చాలా ఇష్టం.

Read Also : వైవిధ్యంగా సాగుతున్న మంచు లక్ష్మి

ఈ చిత్రం ఎంతటి ప్రశంసలు, అవార్డులు గెలుచుకుంటుందో అంతే రివార్డులు అందుకుంటుందని నేను నమ్ముతున్నాను. క్రిష్, పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్, కీరవాణి, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు చిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు. ఇది ఖచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుంది. దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి!” అంటూ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

-Advertisement-"కొండపొలం" ఫస్ట్ రివ్యూ

Related Articles

Latest Articles