విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్యల పోరును తట్టుకోలేని భర్తలుగా వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించిన అనిల్ ఈసారి ఎఫ్ 3లో ఇంకా వినోదాన్ని జోడించాడు. ఫన్ కి ఫ్రస్ట్రేషన్ కి డబ్బు ని కూడా జోడించి మరింత వినోదాన్ని పంచుతాను అంటున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. డబ్బు లేనిదే ప్రపంచం లేదని, డబ్బు గురించి, మందుషులు డబ్బుంటే ఎలా చూస్తారు.. లేకపోతే ఎలా చూస్తారు అనేది సాంగ్ ద్వారా తెలియజేశారు. భాస్కర్ బట్ల రాసిన ప్రతి పదం అరే .. నిజమే కదా అని అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రామ్ మిరియాల హస్కీ వాయిస్ తో ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. చివర్లో రా దిగిరా, స్విస్ బ్యాంక్ గోడ దూకి రా అంటూ సాగిన ఫన్నీ లైన్స్ అదిరిపోయాయి. “మనీకి అంతం లేదు! ఈ మనీ ఆంథెమ్ కి తిరుగు లేదు” అంటూ మేకర్స్ ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ఈసారి ఈ కో బ్రదర్స్ ఎలాంటి ఫన్ ని క్రియేట్ చేసి హిట్ ని అందుకుంటారో చూడాలి.