Extra – Ordinary Man Trailer: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై N సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చేసిన ఎక్స్ట్రా ఎంటర్ టైన్మెంట్ సినిమా అని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. జీవితంలో హీరోగా ఎదగాలనుకొనే ఒక కుర్రాడు. చిన్నతనం నుంచి తనలా కాకుండా.. నిత్యం డిఫరెంట్ గా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. అలా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లా మారతాడు. అది నచ్చని నాన్న.. ఎంత తిట్టినా పట్టించుకోకుండా.. సినిమాల్లో చివరన ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు.
Tillu Square: రాధికా జాతి ఆడవాళ్లకు టిల్లు జీవితం అంకితం
ఇక జీవితం అంటే ఇంతేనా.. తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వమ్మా అని మైసమ్మను అడగడంతో మనోడి లైఫ్ టర్న్ అవుతుంది. ఇక అలా.. వెళ్లి, వెళ్లి.. తనకు సంబంధం లేని ఒక గొడవలో ఇర్రుక్కుంటాడు. మనోడి క్యారెక్టర్ అంతే కాబట్టి.. దాన్ని కూడా డిఫరెంట్ గా ఫీల్ అయ్యి.. విలన్ తో కొట్లాటకు దిగుతాడు. అసలు విలన్ ఎవరు.. ? ఎందుకు.. హీరోతో కయ్యానికి కాలు దువ్వాడు. చివరికి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. హీరో అయ్యాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో ఫుల్ కామెడీని చూపించి అంచలనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇక చివర్లో రాజశేఖర్ ఎంట్రీ అయితే హైలైట్ అని చెప్పాలి. జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను అని రాజశేఖర్ అంటే.. నితిన్.. జీవిత సర్ అనగానే.. జీవితం.. అంటే నాకు రెండు ఒకటేలే అని రాజశేఖర్ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ను బట్టి చూస్తే .. నితిన్ ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడని టాక్ నడుస్తోంది. మరి నితిన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.