యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి ఎంట్రీ ఇస్తున్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో ప్రోమో ఆసక్తికరంగా ఉంది. తొలి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదని ప్రోమో చూస్తే అర్ధమవుతోంది. చరణ్, ఎన్టీఆర్ కలసి రాజమౌళి డైరెక్షన్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.