సీనియర్ దర్శకుడు గుణశేఖర్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ ఈ క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. గుణశేఖర్ కుటుంబ సభ్యులే అయిన నీలిమ గుణ మరియు యుక్తా గుణ ఈ సినిమాను ఎంతో ప్రేమతో నిర్మించారు.
Also Read : Ram Pothineni : దాని కారణంగా.. ఒక్క రాత్రిలో మా కుటుంబం రోడ్డున పడిపోయింది
దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబడింది. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ గిఫ్ట్‌లా ప్రేక్షకులకు ఈ సినిమా రానుంది. ఇందులో లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత వంటి నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా గురించి టీమ్ చెబుతూ .. “నేటి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యేలా ఒక సెన్సిబుల్ కథను తీసుకున్నాం. కథలో వినోదం, భావోద్వేగం, సందేశం అన్నీ మిళితమై ఉంటాయి. ముఖ్యంగా భూమిక పోషించిన పాత్ర చాలా శక్తివంతంగా, భావోద్వేగంగా ఉంటుంది. ఆమె ప్రదర్శన సినిమాలో ఒక హైలైట్‌గా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. మనకు తెలిసి గుణశేఖర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈసారి కూడా కొత్తగా ఆలోచించి, ఒక సాఫ్ట్ ఎమోషనల్ డ్రామా చేయడం గమనార్హం. ఇక భూమిక, సారా అర్జున్‌ల కలయిక కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి ‘యుఫోరియా’ ఈ క్రిస్మస్కి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు, ఓ స్ఫూర్తిదాయకమైన సందేశం అందించబోతుందనే టాక్ ఫిలింనగర్లో వినిపిస్తోంది.