Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
- అందరూ పరార్.. ఒంటరిగా 'దీదీ'
- బెంగాల్‌లో ముగిసిన మమత శకం
- అధికారుల రాజీనామాల పరంపర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Political Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయం పాలై రెండు రోజులు గడుస్తున్నా, రాజకీయ నాటకం మాత్రం ఇంకా ముగియలేదు. రాష్ట్రంలో బీజేపీ తన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుండగా, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి మమతా బెనర్జీ మాత్రం మొండిగా నిరాకరిస్తున్నారు.
నో రాజీనామా..
సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందు పాత ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే మమతా బెనర్జీ మాత్రం తన పదవికి రాజీనామా చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ప్రభుత్వం మమతతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భద్రతను భారీగా తగ్గించింది. మమత పక్కకు తప్పుకోకపోయినా, ఆమె హయాంలో కీలక పదవులు అనుభవించిన సలహాదారులు, మాజీ అధికారులు మాత్రం వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శులు అలపన్ బంద్యోపాధ్యాయ్, హెచ్‌కే ద్వివేది, మనోజ్ పంత్ తాజాగా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఇదే సమయంలో ఆర్థికవేత్త అభిరూప్ సర్కార్ కూడా తన రాజీనామాను సమర్పించారు. “నన్ను మమతా బెనర్జీ నియమించారు. ఆమె ఓడిపోయారు కాబట్టి, నేను ఈ పదవిలో కొనసాగడానికి నైతిక హక్కు లేదు” అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా సైతం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపారు.
Also Read
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
బీజేపీ విజయ విహారం..
రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి స్పష్టమైన మెజారిటీ సాధించింది. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, మే 9న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ రాజీనామాలపై వ్యాఖ్యానించడానికి టీఎంసీ నిరాకరించగా, బీజేపీ మాత్రం మమతపై విమర్శల దాడి పెంచింది. “అధికారులందరికీ కనీస నైతికత ఉంది కాబట్టి రాజీనామా చేశారు. కానీ మమతకు మాత్రం ఆ సిగ్గు లేదు. సొంత గడ్డపైనే ఓడిపోయినా ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు” అని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఎద్దేవా చేశారు. మొత్తానికి బెంగాల్‌లో అధికార మార్పిడి ఉత్కంఠభరితంగా సాగుతోంది. మే 9న జరిగే ప్రమాణ స్వీకారంతో ఈ రాజకీయ అనిశ్చితికి తెరపడనుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?